“చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా” పాట జన్మించి ఇరువది వత్సరములు ఐనప్పటికి,
ఆ పాట లోని కొన్ని వాక్యాల సారం, మన యువతలో చాలామందిని కదిలించి వేస్తుంది.
“చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా! (2)
కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం
సాధించదు యే పరమార్ధం, బ్రతుకును కానీయకు వ్యర్ధం (2)” || చుట్టూ పక్కల ||
“స్వర్గాలను అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కేవూ
సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలవైనావు”
“కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదయమంటే
కరుణను మరిపించేదా చదువు సంస్కారం అంటే
గుండె బండగా మార్చేదా సంప్రదయమంటే” || చుట్టూ పక్కల ||
“నువ్వు తినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించిందీ
గర్వించే ఈ నీ బ్రతుకు ఈ సమాజమే మలిచింది”
“ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా!
తెప్ప తగలబెట్టేస్తావా? యేరు దాటగానే!
ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకు పోతున్నావా!
తెప్ప తగలబెట్టేస్తావా? యేరు దాటగానే!”
“చుట్టూ పక్కల చూడరా చిన్న వాడా, చుక్కల్లో చూపు చిక్కుకున్న వాడా!
కళ్ళ ముందు కటిక నిజం, కానలేని గుడ్డి జపం
సాధించదు యే పరమార్ధం, బ్రతుకును కానీయకు వ్యర్ధం” || చుట్టూ పక్కల ||
ఈ పాట “రుద్రవీణ” చిత్రం లోనిది
రాసిన వారు: “సిరివెన్నెల” (చెంబోలు) సీతా రామ శాస్త్రి
పాడిన వారు: కె. జె. యేసుదాస్
సంగీతం సమ కూర్చినది: ఇళయరాజా
